King Kohli: నన్ను కింగ్ అని పిలిస్తే నచ్చదు..స్టేజ్ పైనే కోహ్లీ వార్నింగ్

0
24

పరుగుల రన్ మిషన్..కింగ్ కొహ్లీ ..చేజింగ్ కింగ్ అని ఇలా రకరకాల పేర్లతో విరాట్ ను ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. అయితే అలా పిలవడం కోహ్లీకి నచ్చదంట.తనను కింగ్ అని పిలిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందని..తనను విరాట్ అని పిలిస్తే చాలంటున్నాడు కోహ్లీ.

నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అన్‌బాక్స్‌ ఈవెంట్‌ జరిగింది.
IPL- 2024 కోసం ఆర్సీబీ కొత్త జెర్సీని రివీల్ చేసింది. కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు కొత్త జెర్సీలో కనిపించారు. అలాగే కొత్త లోగోను రిలీజ్ చేశారు. పాత పేరు Royal Challengers BANGALORE స్థానంలో స్వల్ప మార్పు చేసి Royal Challengers BENGALURUగా మార్చారు.

ఈ ఈ వెంట్ లో కోహ్లీ స్టేజ్ పైన ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది కింగ్ కోహ్లీ అని యాంకర్ ప్రశ్నించగా ప్రేక్షకులు కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. ఫ్యాన్స్ మీరంతా ప్రశాంతంగా ఉండండి.. మేము త్వరగా చెన్నైకి వెళ్లాలని అన్నాడు. అలలాగే యాంకర్ ను ఉద్దేశించి నన్ను కింగ్ అని పిలిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. జస్ట్ విరాట్ అని పిలవండని కోహ్లీ సూచించాడు.